భారత్ మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా
- July 22, 2017
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నగదు నజరానా ప్రకటించింది. అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టు సభ్యులకు తలో రూ.50 లక్షలు నగదు నజరానా ప్రకటించింది. సహాయ సిబ్బందికి తలో రూ.25 లక్షలు ప్రకటించింది. 'క్రికెట్ మక్కా' లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లో మిథాలీసేన ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ కౌర్, వేద కృష్ణమూర్తి దాదాపు అన్ని మాచ్ లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టును ఫైనల్ చేర్చారు. అలాగే రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, శిఖ పాండే, ఏక్తా బిష్ఠ్ అద్భుత బౌలింగ్‌తో జట్టుకు విజయాలు అందించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







