ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండి
- July 23, 2017
కువైట్ : ప్రయాణంలో 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ తమ వెంట తీసుకెళితే ఆ మొత్తాన్ని ప్రకటించండని డైరెక్టర్ జనరల్ జమాల్ అల్-జలావీ ప్రయాణికులను కోరారు. 3000 కువైట్ దినార్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తరలిస్తే , వారి రాక పోకల సమయంలో తరువాత చట్టం 106/4 ప్రకారం అధికారులకు విధిగా తెలియచేయాలని ఆయన కోరారు. . పౌరులు మరియు నివాసితులు డబ్బు తరలించడం నేరమైతే కాదు కానీ ఎంత మొత్తంలో తీసుకెళుతున్నారో తెలియచేయాలని వారి డబ్బుపై కువైట్ తరఫునుంచి ఎలాంటి పరిమితి లేదని ఆయన ప్రకటించారు. కువైట్ అక్రమనగదు బదిలీపై పోరాడటానికి కఠినమైన చట్టం అమలువుతుంది. అంతేకాక , ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేరే అపరిచితులు విమానాశ్రయాలలో తమ సామానులు కాస్తంత పట్టుకోండని అడిగితే సహాయం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. నిషేధిత పదార్ధాలను తరలించేవారు తోటి ప్రయాణికులతో ఇలా వ్యవహరిస్తారని అన్నారు. ఒకవేళ ఎవరైనా అమాయకంగా వారి సన్నులు తీసుకొంటే..పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు నేరస్తునితో పాటు ఆ ప్రయాణికుడికి శిక్ష తప్పదని అన్నారు.నిషేధిత వస్తువుల జాబితా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయాణీకులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదా దాని పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్‌సైట్‌ను సందర్శించాలని సిఫారసు చేసారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







