ఎండవేడిమితో దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ ఇబ్బందులు
- July 24, 2017
ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్, ఎండ వేడిమికి తాళలేకపోతున్నామంటున్నారు. తమ ప్రాంతంలో బస్ షెల్టర్స్ ఉన్నా, అవి ఎండ వేడిమి నుంచి రక్షణ ఇవ్వలేకపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీలో 60,000 మంది వరకూ నివసిస్తున్నారు. వీరికి రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) బస్సులే ముఖ్యమైన రవాణా సాధనాలు. ఎండ వేడిమి 40 డిగ్రీలు దాటితే తమ ఆరోగ్య పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతోందని ప్రయాణీకులు వాపోయారు. కవర్ చేసి ఉన్న ఏసీ బస్ స్టాప్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇంటర్నేషనల్ సిటీ కమ్యూటర్స్ అభ్యర్థిస్తున్నారు. అయితే సమస్యను గుర్తించామనీ, నఖీల్‌తో కలిసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్‌టిఎ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









