150 మంది అమ్మాయల జీవితాలను నాశనం చేసిన ఉన్మాది

- October 20, 2015 , by Maagulf
150 మంది అమ్మాయల జీవితాలను నాశనం చేసిన ఉన్మాది

తనకు ఎయిడ్స్ ఉందనే విషయాన్ని దాచి దాదాపు 150 మంది అమ్మాయిలని మోసం చేసిన జేమ్స్ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జేమ్స్ ఉప్పల్ వాసి. 300 మంది అమ్మాయిల జీవితాలను మోసం చేయడమే తన లక్ష్యంగా జేమ్స్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. హైదరాబాదులోని ఉప్పల్లో ఉంటున్న జేమ్స్ సైకోలా తయారయ్యాడు. అతనికి ఎయిడ్స్ ఉంది. 300 మంది అమ్మాయిల జీవితాలను చెడగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా దాదాపు 150 అమ్మాయిలను తనకు ఎయిడ్స్ ఉందనే విషయం దాచి మోసం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఎయిడ్స్ వ్యాపింప చేస్తున్నాడు. కాగా, ఇతనిని నమ్మి మోసపోయిన అమ్మాయిలతో మాట్లాడి... వారికి ఎయిడ్స్ సోకిందా? తదితర విషయాలను పోలీసులు తెలుసుకోనున్నారు. ఇతను గతంలో ఆధార్ ప్రయివేటు సెంటర్లో పని చేశాడు. కాగా, మరి ఆ అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడా? లేక సిరంజిల ద్వారా తన రక్తాన్ని వారి శరీరంలోకి ఎక్కించాడా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. బాలుడి అపహరణ కేసును చేధించిన పోలీసులు హయత్ నగర్‌లో నవీన్‌ అనే బాలుడి అపహరణ కేసును పోలీసులు చేధించారు. అపహరణకు పాల్పడిన ముగ్గురు నిందితుల్లో మహేష్‌, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు రాజేష్‌ పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేష్‌కు ఆడపిల్లలు పుట్టడంతో వారసుడి కోసం బాలుడిని తీసుకు రావాల్సిందిగా రాజేశ్‌, రామకృష్ణలతో సుపారీ మాట్లాడుకున్నాడు. రూ.60వేలకు బేరం మాట్లాడుకుని ముందస్తుగా రూ2వేలు చెల్లించాడు. నిందితులు పథకం ప్రకారం నవీన్‌ను అపహరించారు. బాలుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టడంతో దొరికిపోతామన్న భయంతో నిందితులు బాలుడిని విడిచి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com