నేటి నుండి షార్జాలో జనాభా లెక్కల సేకరణ మొదలు

- October 20, 2015 , by Maagulf
నేటి నుండి షార్జాలో జనాభా లెక్కల సేకరణ మొదలు

షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ కమ్మ్యూనీటీ డెవలప్మెంట్ (ది.ఎస్. సీ. డీ.) వారి సమాచార సేకరణ -షార్జా సెన్సస్ 2015 నేటినుండి ప్రారంభమైంది. 1800 మందికి పైగా పరిశోధకులు, పర్యవేక్షకులు మరియు స్వచ్ఛంద సేవకులతో ఈ దశ నవంబరు 20 వరకు షార్జా లోని  అన్ని నివాస భవనాలు, వ్యక్తులు మరియు ఆస్తుల యొక్క అన్ని వివరాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగుతుంది. దేశ పౌరులు మరియు నివాసులు జనాభా పత్రాన్ని వ్యక్తిగతంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిoపవచ్చు. ది.ఎస్. సీ. డీ ఛైర్మన్ మరియు సుప్రీం కమిటీ ఫర్ ద షార్జా సెన్సస్ 2015 ఛైర్మన్- షేక్ మొహమద్ బిన్ అబ్దుల్లా అల్ థని - ఈ సెన్సస్ 2015 ప్రణాళికా బద్ధంగా వ్యవస్థీకరించబడ్డాయని అందువల్ల ఇవి గొప్ప విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com