150 మంది అమ్మాయల జీవితాలను నాశనం చేసిన ఉన్మాది
- October 20, 2015
తనకు ఎయిడ్స్ ఉందనే విషయాన్ని దాచి దాదాపు 150 మంది అమ్మాయిలని మోసం చేసిన జేమ్స్ అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జేమ్స్ ఉప్పల్ వాసి. 300 మంది అమ్మాయిల జీవితాలను మోసం చేయడమే తన లక్ష్యంగా జేమ్స్ పెట్టుకున్నాడని తెలుస్తోంది. హైదరాబాదులోని ఉప్పల్‌లో ఉంటున్న జేమ్స్ సైకోలా తయారయ్యాడు. అతనికి ఎయిడ్స్ ఉంది. 300 మంది అమ్మాయిల జీవితాలను చెడగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా దాదాపు 150 అమ్మాయిలను తనకు ఎయిడ్స్ ఉందనే విషయం దాచి మోసం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఎయిడ్స్ వ్యాపింప చేస్తున్నాడు. కాగా, ఇతనిని నమ్మి మోసపోయిన అమ్మాయిలతో మాట్లాడి... వారికి ఎయిడ్స్ సోకిందా? తదితర విషయాలను పోలీసులు తెలుసుకోనున్నారు. ఇతను గతంలో ఆధార్ ప్రయివేటు సెంటర్లో పని చేశాడు. కాగా, మరి ఆ అమ్మాయిలతో శృంగారంలో పాల్గొన్నాడా? లేక సిరంజిల ద్వారా తన రక్తాన్ని వారి శరీరంలోకి ఎక్కించాడా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. బాలుడి అపహరణ కేసును చేధించిన పోలీసులు హయత్ నగర్లో నవీన్ అనే బాలుడి అపహరణ కేసును పోలీసులు చేధించారు. అపహరణకు పాల్పడిన ముగ్గురు నిందితుల్లో మహేష్, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రాజేష్ పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహేష్‌కు ఆడపిల్లలు పుట్టడంతో వారసుడి కోసం బాలుడిని తీసుకు రావాల్సిందిగా రాజేశ్, రామకృష్ణలతో సుపారీ మాట్లాడుకున్నాడు. రూ.60వేలకు బేరం మాట్లాడుకుని ముందస్తుగా రూ2వేలు చెల్లించాడు. నిందితులు పథకం ప్రకారం నవీన్‌ను అపహరించారు. బాలుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టడంతో దొరికిపోతామన్న భయంతో నిందితులు బాలుడిని విడిచి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







