అబుదాబిలో ఇరుకైన గదుల్లో ఉన్నందుకు ఒకే రోజు 40 మంది తెలుగు వారికి జరిమానా

- July 24, 2017 , by Maagulf
అబుదాబిలో ఇరుకైన గదుల్లో ఉన్నందుకు ఒకే రోజు 40 మంది తెలుగు వారికి జరిమానా

అబుదాబిలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది నివసిస్తే, ఆయా ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఎమిరేట్స్‌ నివాస నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న గృహాలపై దాడులు చేసిన అధికారులు ఒకే రోజు 40 మందికి జరిమానాలు విధించడం వారిలో గుబులు రేపుతోంది. ఉపాధి నిమిత్తం వెళ్తున్న తెలుగువారు వేతనాలు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 మంది ఒకే గదిలో ఉంటున్నారు. చాలా కాలంగా అక్కడ ఈ వ్యవహారం సాగుతుండగా, అబుదాబి ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝలిపిస్తోంది. ఎమిరేట్స్‌ రెసిడెన్షియల్‌ నియమా వళి-2011 చట్టం సంఖ్య-1లో పేర్కొన్నట్లుగా అబుదాబి మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నవారు ఇకపై ఒక గదిలో ముగ్గురికన్నా మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్‌మెంట్‌ లేదా విల్లాలో ఒక కుటుంబం మాత్రమే ఉండాలని, బ్రహ్మచారులైతే ఒక బెడ్‌ రూమ్‌లో ముగ్గురు వ్యక్తులే ఉండాలని, వంట గది, కారిడార్‌, సాధారణ ప్రాంతాల్లో నిద్ర పోవడానికి ఉపయోగించవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com