భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా

- July 25, 2017 , by Maagulf
భారత్ మహిళా క్రికెట్ సేనకు బీసీసీఐ భారీ నజరానా

ఐసీసీ మహిళా ప్రపంచకప్ టైటిల్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. టైటిల్ పోరులో ఓడినప్పటికీ, అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శించిన మిథాలీ సేనను ప్రశంశించకుండా ఉండలేకపోయారు.  ప్రధాని నుంచి సామాన్య అభిమాని వరకూ భారత జట్టుపై అభినందల వర్షం కురిపిస్తున్నారు.  బుధవారం స్వదేశానికి రానున్న మిథాలీ సేనను భారీగా సత్కరించాలనుకుంటోంది బిసీసీఐ.  జట్టులో భాగమైన క్రీడాకారులందరికీ తలా 50 లక్షలు, సహాయ సిబ్బందికి 25 లక్షల రూపాయలు అందజేయనుంది.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా క్రికెట్ జట్టుకు 50 లక్షల నజరానా ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com