అబుదాబిలో ఇరుకైన గదుల్లో ఉన్నందుకు ఒకే రోజు 40 మంది తెలుగు వారికి జరిమానా
- July 24, 2017
అబుదాబిలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది నివసిస్తే, ఆయా ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఎమిరేట్స్ నివాస నిబంధనలు ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న గృహాలపై దాడులు చేసిన అధికారులు ఒకే రోజు 40 మందికి జరిమానాలు విధించడం వారిలో గుబులు రేపుతోంది. ఉపాధి నిమిత్తం వెళ్తున్న తెలుగువారు వేతనాలు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 మంది ఒకే గదిలో ఉంటున్నారు. చాలా కాలంగా అక్కడ ఈ వ్యవహారం సాగుతుండగా, అబుదాబి ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝలిపిస్తోంది. ఎమిరేట్స్ రెసిడెన్షియల్ నియమా వళి-2011 చట్టం సంఖ్య-1లో పేర్కొన్నట్లుగా అబుదాబి మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నవారు ఇకపై ఒక గదిలో ముగ్గురికన్నా మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్మెంట్ లేదా విల్లాలో ఒక కుటుంబం మాత్రమే ఉండాలని, బ్రహ్మచారులైతే ఒక బెడ్ రూమ్‌లో ముగ్గురు వ్యక్తులే ఉండాలని, వంట గది, కారిడార్, సాధారణ ప్రాంతాల్లో నిద్ర పోవడానికి ఉపయోగించవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







