దుబాయ్ విమానంలో సీటు కింద భారీగా బంగారం

- July 25, 2017 , by Maagulf
దుబాయ్  విమానంలో సీటు కింద భారీగా బంగారం

దుబాయ్: దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో సోదా జరిపిన అధికారులు భారీగా బంగారాన్ని కనుగొన్నారు. ప్రయాణికులంతా వెళ్లి పోయిన తర్వాత అధికారులు విమానాన్ని తనిఖీ చేయగా ఓ సీటు కింద ఉన్న మూడు కిలోల బంగారం బిస్కెట్లను కనుగొన్నారు. దీని విలువ రూ.1.15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ ఇంటలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. అక్రమంగా తీసుకువచ్చిన బంగారం పట్టుబడుతుందనే భయంతోనే అక్కడే పడేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిని ఎవరు వదిలి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com