తొలిసారి భారత్ లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు
- July 25, 2017
భారత బాక్సింగ్‌లో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. 2021లో నిర్వహించనున్న పురుషుల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు భారత్ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) ప్రకటించింది.
ఈ పోటీలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై రెండు రోజులుగా మాస్కోలో ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది. ఈ చర్చల అనంతరం భారత్‌లో నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. పురుషుల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కి ఇదే తొలిసారి.
2019లో సోచిలో పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కుయో వు తెలిపారు. ఆ తర్వాత 2021లో పురుషుల ఛాంపియన్షిప్ కూడా భారత్‌లోనే జరగనుంది. ఇక 2018లో మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను భారత్ ఆతిథ్యమివ్వనుంది.
మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2006లో భారత్ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఆగస్టులో హాంబర్గ్‌లో జరగబోయే పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చింగ్ కుయో తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









