ఎన్నారైలకు ఆదాయపు పన్నుపై ఇండియా క్లారిటీ

- July 26, 2017 , by Maagulf
ఎన్నారైలకు ఆదాయపు పన్నుపై ఇండియా క్లారిటీ

దుబాయ్‌: ఎన్నారైలు ఇంకమ్‌ ట్యాక్స్‌ రిఫండ్స్‌ కోసం దర్యాప్తు చేసుకోవాల్సి వస్తే, భారతదేశంలో బ్యాంక్‌ అకౌంట్‌ లేనివారు ఏం చేయాలన్నదానిపై భారత ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. తమకున్న విదేశీ బ్యాంకు అకౌంట్‌ వివరాల్ని పేర్కొంటూ అప్లికేషన్‌ పూర్తి చేస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంకమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ ఫామ్స్‌ ఫర్‌ ది అస్సెస్‌మెంట్స్‌ ఇయర్‌ 2017-18 మార్చి 30 నోటిఫై చేయబడిందని మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాతి నుంచి పెద్ద సంఖ్యలో ఎన్నారైలనుంచి ఆదాయపు పన్ను విషయమై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో బ్యాంక్‌ అకౌంట్‌ లేని తమకు రిఫండ్స్‌ ఎలా వస్తాయని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నారైల కోసం విదేశాల్లోని తమ అక్కౌంట్ల వివరాలు తెలిపితే సరిపోతుందని కేంద్రం స్పష్టతనివ్వడం జరిగింది. ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గదని దుబాయ్‌లో ఇండియా కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ చెప్పారు. దుబాయ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సెక్రెటరీ అనీష్‌ మెహతా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత ఆహ్వానించదగ్గదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com