వరుణ్ తేజ్ ఫిదా సక్సెస్ మీట్
- July 26, 2017
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా మూవీ విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ తెచ్చుకొని , కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ అయితే ఫిదా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా కు ప్రధాన ఆకర్షణ గా సాయి పల్లవి నిలిచింది. ఆమె చెప్పిన డైలాగ్స్ కు ఫిదా అవుతున్నారు.
ఈ నేపథ్యం లో చిత్ర యూనిట్ ఫిదా సంబరాలు జరపడానికి ప్లాన్ చేసింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో ఫిదా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సక్సెస్ మీట్ కు సినిమా నటి నటులతో పాటు ఇండస్ట్రీ లోని మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా , శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









