డ్రగ్స్ కేసులో డచ్ దేశీయుడు కీలక నిందితుడు మైక్ కమింగా అరెస్ట్

- July 27, 2017 , by Maagulf
డ్రగ్స్ కేసులో డచ్ దేశీయుడు కీలక నిందితుడు మైక్ కమింగా అరెస్ట్

 డ్రగ్స్ కేసులో ఇప్పటివకూ అరెస్టైన వాళ్లంతా ఒక ఎత్తు. నిన్న దొరికిన డచ్ దేశీయుడు మైక్ కమింగా మరో ఎత్తు అని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్తున్నారు. సినీ ప్రముఖులతోపాటు, ITలోనూ చాలా మందికి డ్రగ్స్ ఇతని ద్వారానే సరఫరా అయినట్టు గుర్తించామన్నారు. డార్క్‌నెట్‌లో మత్తుమందులు ఆర్డర్ చేసే వారికి వాటిని డెలీవరీ చేసింది కమింగా యేనని నిర్థారించారు. నిన్న అతన్ని అరెస్టు చేసినప్పుడు 2.6 గ్రాముల DMT సీజ్ చేశారు. 33ఏళ్ల కమింగా హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకుని, నానక్‌రాంగూడలోనే ఉంటున్నాడు. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఇండియా వచ్చి వెళ్లాడు. టెక్కీగా అద్భుతమైన నాలెజ్డ్ ఉన్న ఇతను, ఆ పరిచయాలతోనే హైదరాబాద్‌లో కొన్ని ఐటీ కంపెనీలకు సేవలు అందించాడు. అలా మొదలైన పరిచయాల ద్వారా చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేశాడు. కెల్విన్‌కి కూడా డ్రగ్స్ ఇచ్చింది కమింగానే అని తేల్చారు. విదేశీయుడైనందున అతన్ని విచారించేందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ప్రకారం సిట్ అధికారులు ముందుకెళ్తున్నారు. మొత్తం కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అకున్ సభర్వాల్.. త్వరలో మరో బాంబ్ పేల్చబోతున్నట్టు సమాచారం. పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు ఆధారాలు దొరకడంతో వారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com