రివ్యూ : వాసుకి

- July 28, 2017 , by Maagulf
రివ్యూ : వాసుకి

స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `వాసుకి`. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి అనువాద చిత్రంగా ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది. మరి వాసుకి గా నయనతార ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
ఒక అపార్ట్మెంట్ లో తన భర్త (మమ్ముట్టి), తన కూతురు తో హ్యాపీ గా జీవనం సాగిస్తుంటుంది వాసుకి (నయనతార). ఓ రోజు అదే అపార్టుమెంట్లో ఉంటున్న ముగ్గురి యువకుల చేతులో అత్యాచారానికి గురి కావాల్సి వస్తుంది. ఈ విషయాన్నీ తన భర్త కు చెప్పుకోలేక తనలో తానే మానసికంగా బాధపడుతుంటుంది. అలా మానసిక వ్యథలో ఉన్న ఆమెకు ఒక మహిళా అధికారి సహాయం దొరుకుతుంది. ఆ అధికారి సాయం తో ఆమె ఏం చేస్తుంది..? ఆ ముగ్గురు యువకుల ఫై పగ తీర్చుకుంటుందా..? లేక తన భర్త కు జరిగిన సంఘటనను తెలియజేస్తుందా..? అసలు వాసుకి ఏం చేస్తుందనేది మీరు తెర ఫై చూడాలి.
* నయనతార యాక్టింగ్
* సెకండ్ హాఫ్
* బ్యాక్ గ్రౌండ్ స్కోర్
* ఫస్ట్ హాఫ్
* ఎమోషన్
* ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
* ముగ్గురి యువకుల చేతులో అత్యచారానికి గురైన మహిళా పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడే రోల్ లో మహిళలను కంట తడి పెట్టించింది. సినిమా అంత తానే చుట్టే తిరగడం తో నయన తార ప్రతి సన్నివేశం లో ఎంతో ఆకట్టుకుంది. సినిమా అంత తన భుజాల ఫై వేసుకుంది. వాసుకి భర్త గా మమ్ముట్టి బాగానే చేసాడు. సెకండ్ హాఫ్ లో మమ్ముట్టి కి పూర్తి రోల్ దొరికినట్లు అయ్యింది.
దర్శకుడు ఏకే. సాజన్ ఈ కథ ను బాగా హ్యాండిల్ చేశాడు. ఇంటర్వెల్ తో మొదలైన సినిమా అసలు కథ సెకండాఫ్ నుండి రసవత్తరంగా మారుతుంది. ఆ కథనంలోని ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, కొత్తగా ఉంటుంది. ఒక మహిళ తన పై ఎలాంటి పోలీస్ కేసులు రాకుండా తన బాధకు కారణమైన వాళ్ళను శిక్షించే తీరును, ఆమెకు సహాయం చేసే వ్యక్తి వేసే ప్లాన్స్ లాజిక్స్ కు సినిమా ఫై ఆసక్తి పెంచేలా ఉంటాయి.

కాకపోతే ఫస్ట్ హాఫ్ పైన కాస్త దర్శకుడు శ్రద్ద పెడితే ఇంకా బాగుండు. చాల సన్నివేశాలు బోర్ ఫీలింగ్ తెస్తాయి. దితో సెకండ్ హాఫ్ ఫై పెద్దగా ఇంట్రస్ట్ లేకుండా చేసాయి. ఫస్ట్ హాఫ్ లో కాస్త కామెడీ , రొమాంటిక్ సన్నివేశాలు జోడిస్తే ప్రేక్షకుడికి బాగా నచ్చు.

* ఇక రోబి వర్గేశ్ రాజ్ సినిమాటోగ్రఫీ సహజంగా ఉంది. కీలక సన్నివేశాల్లో గోపి సుందర్ అందించిన నైపథ్య సంగీతం ఆకట్టుకుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో చాల సన్నివేశాలు లేపేస్తే బాగుండు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో వాసుకి సినిమా రూపొందింది. ఇలాంటి కథతోనే గత నెలలో శ్రీదేవి నటించిన మామ్ చిత్రం వచ్చింది. కాకపోతే అక్కడ తన కూతురిని అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకుంటుంది. ఇక్కడ మాత్రం తనపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకుంటుంది నయనతార..అంతే తేడా మిగతంతా సేమ్ టూ సేమ్..ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఓవరాల్ గా వాసుకి - హార్ట్ టచ్ మూవీ అని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com