ఆగస్ట్‌ 1 నుంచి భారతీయ కార్మికులకు మేలైన ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌

- July 28, 2017 , by Maagulf
ఆగస్ట్‌ 1 నుంచి భారతీయ కార్మికులకు మేలైన ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌

దుబాయ్‌: ఆగస్ట్‌ 1 నుంచి ఇండియన్‌ బ్లూ కాలర్‌ వర్కర్స్‌కి బెటర్‌ ఇన్స్యూరెన్స్‌ కవరేజ్‌ అందనుంది. ఇందుకుగాను, తప్పనిసరి ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌ని మరింత సరళతరం చేసింది భారత ప్రభుత్వం. ప్రవాసీ భారతీయభీమా యోజనా (పిబిబివై) పేరుతో రూపొందించిన ఈ స్కీమ్‌ 18 దేశాల్లో పనిచేస్తోన్న భారతీయ కార్మికులకు ఉపయోగకరంగా మారనుంది. ఆగస్ట్‌ 1 నుంచి ఈ స్కీమ్‌ అమల్లోకి వస్తుందని దుబాయ్‌లోని ఇండియన్‌ కాన్సులేట్‌ పేర్కొంది. యూఏఈలో 2.8 మిలియన్‌ భారతీయులు బ్లూ కాలర్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి కొన్ని నిబంధనలు కఠినతరంగా ఉండేవనీ, ఆ కారణంగా కార్మికులు ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారనీ, వాటన్నిటినీ సరళతరం చేయడంతోపాటుగా మరింత మెరుగ్గా ఇన్స్యూరెన్స్‌ సేవలు అందించేలా మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో రెన్యువల్‌ చేసుకోవడం, శాశ్వత వైకల్యం, యాక్సిడెంటల్‌ డెత్‌ వంటివాటిని ఇన్స్యూరెన్స్‌ పరిధిలోకి తీసుకురావడం, 75,000 నుంచి 1,00,000 రూపాయల వరకు హాస్పిటలైజేషన్‌ కవరేజీ, వంటివి ఈ కొత్త స్కీమ్‌ ప్రత్యేకతలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com