హిందూ మనోభావాలను గౌరవిస్తాము..నాకు నేనే తోపు తురుమ్ నిర్మాత ధృవ కుమార్
- July 28, 2017
ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటించిన చిత్రం 'నాకు నేనే తోపు తురుమ్'. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ హిందూ జనశక్తి సంస్థ చెప్పింది. అయితే తమకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని చిత్ర నిర్మాత ధృవ కుమార్ తెలిపారు. అలా భావించిన వారికి క్షమాపణలు చెప్పారు. నిర్మాత ధృవ కుమార్ మాట్లాడుతూ ...''హిందూ మతం అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఏ మతాన్ని కించపరిచేలా సినిమా ఉండదు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్ధంతో బతుకుతున్నారు. ధర్మం అనేది లేకుండా పోయింది అనే విషయాన్ని కొంత అగ్రెసివ్ గా చెబుతూ ప్రచారం చేశాం. మాకు తెలియకుండానే ఎవరైనా నొప్పిస్తే క్షమాపణ కోరుతున్నాను. ఈ విషయం మా దృష్టికి తీసుకుని వచ్చిన హిందూ జనశక్తి సంస్థకు, సంస్థ అధ్యక్షుడు లలిత్ కుమార్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







