గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా GFA అవార్డు అందజేసిన బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్
- July 28, 2017
దక్షిణాదిలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ పురస్కారాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన యాప్స్ గ్రూప్ రైసింగ్ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 21న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ దక్షిణాది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ జీఎఫ్ఏకు ఈ పురస్కారాన్ని అందించింది. రైసింగ్ లీడర్ షిప్ అవార్డు అందుకోవడంపై గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ సంస్థ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ...రైసింగ్ లీడర్ షిప్ అవార్డు మాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నాము. మరింత ప్రభావంతంగా పనిచేసేందుకు మాకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రెండేళ్లలో మా సంస్థకు 7 అవార్డులు దక్కాయి. 2016 లో నాలుగు పురస్కారాలు రాగా...ఈ ఏడాది మూడు అవార్డులు అందుకున్నాం. మా సంస్థలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాకు ఈ పురస్కారాల దక్కడం కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగుతుంది. ప్రతి విద్యార్థి విజయమే మా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ విజయంగా భావిస్తాము. అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







