‘మున్నాభాయ్’ పుట్టినరోజున అదరగొట్టే సీన్
- July 29, 2017
బాలీవుడ్ ‘మున్నాభాయ్’ సంజయ్‌దత్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 58 సంవత్సరాలు నిండిన ఈ అగ్రహీరో తన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుకలు చేసుకుంటున్నాడు. సంజయ్‌దత్‌కు 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడినప్పటికీ, అతని సత్ప్రవర్తన కారణంగా 8 నెలల ముందుగానే అతనికి జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. దీంతో సంజయ్‌దత్ తిరిగి ‘భూమి’ అనే సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సంజయ్‌దత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదలచేసింది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో సంజయ్‌దత్ ముఖాన్ని కొంతవరకూ మాత్రమే చూపించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సంజయ్ పూర్తి ముఖ కవళికలను చూపించారు. ఈ పోస్టర్‌లో సంజయ్‌దత్ లుక్ ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!









