ఉమాజాజ్ లో 700,000 క్యాప్కాన్ మాదకద్రవ్య మాత్రలు పట్టివేత
- July 29, 2017
గురువారం టాబుక్ లోని ఉమ్లాజ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ దళం ప్లాస్టిక్ గొట్టాలలో రహస్యంగా దాచిపెట్టిన 700,000 ఆమ్ఫెటమిన్ మాత్రలను అక్రమ రవాణను అడ్డుకొన్నారు. సరిహద్దు గార్డు ప్రతినిధి అయిన సాహెర్ బిన్ మహ్మద్ అల్-హర్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్లాజ్ అధికార పరిధిలోని ఒక ద్వీపంలో నీటి ఉపరితలంపై రబ్బరుతో ముడి వేసి ఉన్న కొన్ని ప్లాస్టిక్ గొట్టాలు అనుమానాస్పదంగా గుర్తించినపుడు సముద్రపు గస్తీదళం వాటిని చుట్టుముట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న గస్తీ మరియు నౌకాదళ గస్తీలను మద్దతు ఇచ్చేవారు మరియు నీటిలో వెతికే గజ ఈతగాళ్ళ సహాయంతో పూర్తిగా ఈ ప్రాంతాన్ని వెతకడానికి తీసుకువచ్చారు. వారు నీటిలో రెండు చివరలు మూసివేసిన ప్లాస్టిక్ గొట్టాలను 372 ప్లాస్టిక్ సంచులను కనుగొన్నారు. అందులో 700,000 కంటే ఎక్కువ క్యాప్టన్ మాత్రలను స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై మరిన్ని చర్యలకు అధికారులకు అప్పగించాయని అల్ హర్బీ చెప్పారు. అక్రమ మాదక ద్రవ్యాల రవాణాదారుల పదేపదే చేస్తున్న ప్రయత్నాల్లో ఉపయోగిస్తున్న అనేక పద్ధతులకు ధీటుగా సరిహద్దు గస్తీ దళం రాజ్యంలో అక్రమ మాదక ద్రవ్యాలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఆయన అంన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







