చైనాలో దారుణం, అప్పులు ఎగ్గొట్టేందుకు ప్లాస్టిక్ సర్జరీ
- July 30, 2017
పెద్ద పెద్ద నేరాలు, మోసాలు చేసిన వ్యక్తి ...ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని తప్పించుకోవటం సినిమాల్లో చూశాం. చైనాలో అచ్చు ఇలాంటిదే జరిగింది. ఓ మహిళ అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని తన ముఖాన్నే మార్చేసుకుంది. ఘటన.వివరాల్లోకి వెళితే..జిన్హువా ప్రాంతానికి చెందిన జు నజువాన్ అనే మహిళ పలు బ్యాంకులు, సంస్థల నుంచి దాదాపు 25 మిలియన్ యువాన్ల (సుమారుగా రూ.25 కోట్లు) వరకు అప్పులు తీసుకుంది. అయితే వీటిని తిరిగి చెల్లించకపోవడంతో ఈ విషయం కాస్తా పోలీసులు, కోర్టుల దాకా వెళ్లింది. దీనిపై విచారించిన వుహాన్‌లోని న్యాయస్థానం.. నజువాన్ తాను తీసుకున్న మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
దీంతో అప్పుల నుంచి తప్పించుకునేందుకు నజువాన్ మరో నగరానికి పారిపోయింది. ఎట్టకేలకు ఆమె ఆచూకీ కనుగొన్న పోలీసులు అక్కడికి వెళ్లి అవాక్కయ్యారట. నజువాన్ వయసు 59 ఏళ్లు. అయితే పోలీసులు కనుగొన్న అడ్రస్‌కు వెళ్లి చూస్తే అక్కడ ముప్పై ఏళ్లలో ఉన్న ఓ అమ్మాయి కన్పించడంతో మొదట కంగుతిన్నారు. ఆ తర్వాత ఆమెనే నజువాన్ అని తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. అప్పులు ఎగ్గొట్టేందుకు నజువాన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







