అభిమానులకు ‘స్పైడర్’ ‘బూమ్ బూమ్'
- July 30, 2017
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్’. అభిమానులకు సర్‌ప్రైజ్‌గా ఈ చిత్రంలోని ‘బూమ్ బూమ్’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. పూర్తి పాటను ఆగస్టు 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఎ.ఆర్. మురుగదాస్ ‘స్పైడర్’కు దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. హ్యారిస్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తైంది. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









