రానురాను పురుషుల్లో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్
- July 31, 2017
ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని పురుషుల్లో పునరుత్పత్తి శక్తి ఘోరంగా పడిపోతుంది. అంటే, వారి స్పెర్మ్ (వీర్యం) కౌంట్ వేగంగా పడిపోతోంది. 1973 నుంచి 2011 సంవత్సరాల మధ్య ఈ దేశాల పురుషుల్లో స్పెర్ప్ కౌంట్ 50 నుంచి 60 శాతానికి పడిపోయినట్లు జెరూసలెంలోని హెబ్రూ యూనివర్శిటీ నిర్వహించిన ఓ తాజా అధ్యయనంలో తేలింది. 42,935 మంది శాంపిళ్లను అధ్యయనం చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఆశ్చర్యంగా ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల పురుషుల్లో వీర్య కౌంట్ స్థిరంగానే కొనసాగుతోందని ఆ ఆధ్యయనం తెలిపింది. అయితే ఈ దేశాల పురుషుల వీర్యానికి సంబంధించిన డేటా తమ వద్ద ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా తగ్గిందా, లేదా ? అన్న అంశాన్ని అంత కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పరిశోధకులు తెలిపారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో తగ్గిన విషయాన్ని తాము స్పష్టంగా గుర్తించామని, అందులో ఎలాంటి సందేహం లేదని వారంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2060 నాటికి ఈ దేశాల్లో పురుషుల్లో పునురుత్పత్తి శక్తి పూర్తిగా పడిపోతుందని పరిశోధకులు హెచ్చరించారు.
ధూమపానం, వాతావరణ కాలుష్యమే స్పెర్మ్ కౌంట్ పడిపోవడానికి కారణమని పరిశోధకులు అనుమానిస్తున్నారు. బిస్ఫెనాల్ ఏ లాంటి రసాయనాలు, ఇతర విష రసాయనాల ప్రభావానికి గురవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని గుర్తించామని, అయితే ఈ విషయంలో మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని హెబ్రూ యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. గతంలో అనుమానించినట్లుగా స్థూలకాయానికి, స్పెర్మ్ కౌంట్ పడిపోవడానికి మాత్రం ఎలాంటి సంబంధం లేదని వారన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









