ఉదయం పూట కేకులు తినొద్దు.. నూడుల్స్ వద్దే వద్దు
- July 31, 2017
అల్పాహారంపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నోటికి ఏవి దొరికితే అవి తిని సరిపెట్టుకునే వారు చాలామంది వున్నారు. అయితే అల్పాహారంగా ఏవి పడితే అవి తినకూడదు. ఉదయం పూట కేకులు తినడం సరికాదు. ఇందులో పంచదార, వెన్న ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీటిని ఉదయం తినడం ద్వారా శరీరంలో ఎక్కువ కెలోరీలు చేరిపోతాయి. ఇంకా బంగాళాదుంపలను అల్పాహారంలో తీసుకుంటే పొట్టలో ఇబ్బందితో అసౌకర్యానికి గురవుతారు.
ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం మంచిది. కొందరు పండ్ల రసాలను ఫ్రిజ్‌లో వుంచుతారు. వాటిని తాగడం ద్వారా కడుపులో బ్యాక్టీరియా చేరుతుంది. ఇక అల్పాహారంలో నూడుల్స్ తీసుకోవద్దు. వాటిలో సోడియం అధికం. అలాగే రాత్రిపూట మిగిలిన చికెన్ వంటకాలను ఫ్రిజ్‌లో వుంచి మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్‌ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







