అజిత్‌ నటిస్తున్న వివేగం సెన్సార్‌ పూర్తి

- July 31, 2017 , by Maagulf
అజిత్‌ నటిస్తున్న వివేగం సెన్సార్‌ పూర్తి

 అజిత్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘వివేగం’. తెలుగులో ‘వివేకం’గా విడుదలకానుంది. ఏకకాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయాలని దర్శకుడు శివ ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాజల్‌ కథానాయికగా నటించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్లొచ్చింది. దీనిని చూసిన అధికారులు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో సినిమాను విడుదల చేయడానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టారు. త్వరలో ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఆగస్టు 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com