పాకిస్తాన్ ప్రధానిగా అబ్బాసీ ప్రమాణం
- August 01, 2017
పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేత షాయీద్ కఖాన్ అబ్బాసీని దేశ ప్రధానిగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మంగళవారం ఎన్నుకుంది. నవాజ్ షరీఫ్‌ను సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. సభలో మొత్తం 321 ఓట్లకు గాను అబ్బాసీకి 221 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)కి చెందిన నవీద్‌కు 47 ఓట్లు, తెహ్రికీ ఇన్సాఫ్ నేత రషీద్ అహ్మద్‌కు 33 ఓట్లు, జామాత్ ఈ ఇస్లామీ నేత తరీఖుల్లాకు నాలుగు ఓట్లు పోలయ్యాయి.అనంతరం అధ్యక్షుడి భవనంలో జరిగిన కార్యక్రమంలో అబ్బాసీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి: అబ్బాసీ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తన తండ్రి 1988లో మృతి చెందడంతో రాజకీయ అరంగేట్రం చేశారు. 1988, 1990, 1993, 1997, 2008, 2013.. ఆరుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 58 ఏళ్ల అబ్బాసీ.. నవాజ్ షరీఫ్‌కు అత్యంత విధేయుడే కాదు ఆయన వ్యక్తిగత టీమ్‌లో ముఖ్యుడు. పార్లమెంట్లో ధనికుల్లో ఒకరు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







