షార్జా రోడ్లపై కొత్త స్మార్ట్‌ రాడార్లు

- August 02, 2017 , by Maagulf
షార్జా రోడ్లపై కొత్త స్మార్ట్‌ రాడార్లు

కొత్త స్మార్ట్‌ రాడార్లను షార్జా రోడ్లపై ఏర్పాటు చేయనున్నారు. ఈ రాడార్ల ఏర్పాటుతో రోడ్లపై ట్రాఫిక్‌ ఉల్లంఘనుల భరతం పట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్లపై ఉల్లంఘనలకు పాల్పడేవారికి సంబంధించి లైవ్‌ వీడియోల్ని ఈ రాడార్లు రికార్డ్‌ చేస్తాయి. ఏ వేగంతో వెళ్ళినాసరే కారులోని అన్ని సీట్లలో ఉన్నవారినీ స్పష్టంగా చూపించడం ఈ రాడార్ల ప్రత్యేకత అని షార్జా పోలీస్‌ పెట్రోల్స్‌ అండ్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ మేజర్‌ మొహమ్మద్‌ అల్‌ నక్బి చెప్పారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్‌ చట్టం ప్రకారం సీటు బెల్టు పెట్టుకోని వ్యక్తి నుంచి 400 దిర్హామ్‌లు జరీమానాగా వసూలు చేస్తారు, అలాగే అతని ఖాతాలో 4 బ్లాక్‌ పాయింట్స్‌ నమోదవుతాయి. కారులో మిగతా ప్రయాణీకులు సీటు బెల్టు పెట్టుకోకపోతే డ్రైవర్‌కి అదనంగా మరో 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. ఇతర వాహనాలతో సరైన గ్యాప్‌ పాటించకపోవడం, హెవీ వెహికిల్స్‌కి సంబంధించి ప్రత్యేక లేన్‌ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com