బెస్ట్ ఆన్‌బోర్డ్ అమెనిటీస్: కువైట్ ఎయిర్వేస్కి అవార్డ్
- August 03, 2017
కువైట్ ఎయిర్వేస్, బెస్ట్ ఆన్‌బోర్డ్ ఎమినిటీస్ కేటగిరీలో పురస్కారం అందుకుంది. యాన్యువల్ ట్రావెల్ ఎగ్జిబిషన్లో ఈ పరస్కారం దక్కించుకుంది కువైట్ ఎయిర్వేస్. జర్మన్ నగరం హంబర్గ్‌లో ఈ ఈవెంట్ జరిగింది. కువైట్ ఎయిర్వేస్ హెడ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఫాయెజ్ అల్ ఎనెజి ఈ విషయం గురించి మాట్లాడుతూ, కువైట్ నేషనల్ కెరీర్ అయిన కువైట్ ఎయిర్‌లైన్స్‌ని గ్లోబెట్రాటర్స్ సౌకర్యాల పరంగా అత్యున్నత స్థానానికి ఎంపిక చేశారని అన్నారు. గ్లోబల్ ట్రావెలర్ మ్యాగజైన్ అధికారిక వెబ్సైట్ ద్వారా సర్వే నిర్వహించి, ఈ అరుదైన పురస్కారాన్ని కువైట్ ఎయిర్వేస్కి అందజేశారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందకు కువైట్ ఎయిర్వేస్ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుందని ఫయెజ్ అల్ ఎనిజి చెప్పారు. కువైట్ ఎయిర్‌వేస్‌ని 1962లో కువైట్ గవర్నమెంట్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







