రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు
- August 03, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అల్ ఖైమాలో జరిగింది. రమ్స్ షమాల్ రోడ్‌పై ఈ ఘటన చోటు చేసుఉంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కార్లు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, పోలీసులు, పారామెడిక్స్‌ని అలాగే రెస్క్యూ టీమ్స్‌ని పంపించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ప్రమాదం తర్వాత అగ్ని కీలలు వ్యాపించాయనీ, ఆ అగ్ని కీలల కారణంగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







