దుబాయికి ఇండియన్స్ విజిటింగ్ వీసాలపై రావద్దు
- August 03, 2017
ఉపాధి కోసం యూఏఈ రావాలనుకునే వారు విజిటింగ్ వీసాలపై మాత్రం ఇక్కడికి రావద్దని యూఏఈ ప్రభుత్వం భారతీయులను కోరింది. వీసా మోసాలు, నకిలీ ధ్రువపత్రాలు పెద్ద సంఖ్యలో బయటపడుతున్న నేపథ్యంలో యూఏఈ ఈ మేరకు సూచనలు వెలువరించిందని దుబాయిలోని భారతీయ రాయబార కార్యాలయం వివరించింది. ప్రతిరోజు ఇందుకు సంబంధించి వందలాదిగా బాధితుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపింది.
ఇలా మోసపోయి విజిటింగ్ వీసాలపై 2016లో యూఏఈకి వచ్చిన 225 మంది భారతీయులను, 2017లో ఇప్పటివరకు 186 మందికి టికెట్లు కొనుగోలు చేసి ఇచ్చి ప్రభుత్వం వెనక్కి పంపిందని పేర్కొంది. నకిలీ వీసాలను భారతదేశంలో గుర్తించటం చాల కష్టమని భారత రాయబార కార్యాలయం వివరించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కోసం వచ్చే భారతీయులు నమ్మకమైన వారి ద్వారా కచ్చితమైన ఉద్యోగ వీసా పత్రాలను, ధ్రువీకరణలను పొందాలని లేని పక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







