కాసేపట్లో ప్రారంభం కానున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
- August 04, 2017
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్‌లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లు వేయనున్నారు. తమకు నచ్చిన అభ్యర్థి పేరుపై మార్కింగ్ చేసేందుకు పార్లమెంటు సభ్యులు ప్రత్యేక కలాలను వినియోగించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రం ఏడు గంటల కల్లా ఫలితాన్ని వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అధికార ఎన్‌డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, భాజపా మాజీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌డీఏకి తగిన సంఖ్యా బలం ఉన్నందున విజయం వెంకయ్యనాయుడినే వరించనుంది. తమ అభ్యర్థి గెలుపుపై ఎన్‌డీఏ పూర్తి విశ్వాసంతో ఉంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







