వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌

- August 05, 2017 , by Maagulf
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇటీవల వాట్సాప్‌నకు సంబంధించిన అనేక కొత్త ఫీచర్ల సంగతులు బయటికొచ్చాయి. వీడియో కాల్‌లో ఇమేజ్‌ ఇన్‌ మోడ్‌, స్టిక్కర్లు పంపుకునే సౌలభ్యం, టెక్ట్స్‌ కొత్త ఎఫెక్ట్స్‌ జోడించేలా ఫీచర్ల వంటివి కొన్ని పరిశీలన దశలో ఉండగా మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌లోనూ రంగురంగుల బ్యాగ్రౌండ్‌తో స్టేటస్‌ పెట్టుకోవచ్చు. ఇందులో ఫేస్‌బుక్‌ తరహాలో ఫాంట్‌ ఎమోజీలను ఉపయోగిండం, బ్యాగ్రౌండ్‌ మార్చుకోవడం వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరిశీలన దశలో ఉంది.
ఆండ్రాయిడ్‌ బేటా వెర్షన్‌ 2.17.291లో ఈ కొత్త ఫీచర్‌ను జోడించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం. స్టేటస్‌లో ఎదైనా టెక్ట్స్‌ రాశాక నచ్చిన కలర్‌ బ్యాగ్రౌండ్‌ పెట్టడం, ఫాంట్‌ స్టైల్‌ మార్చడం, ఎమోజీలను జోడించడం వంటివి ఈ ఫీచర్‌ ద్వారా చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com