బహ్రెయిన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
- August 05, 2017
బహ్రెయిన్: తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతలు జయశంకర్ సారుకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారం తెలంగాణకు మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు బహ్రెయిన్‌లో హరితహారం చేపట్టారు.
బహ్రెయిన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై సార్ పరిశీలన చాలా గొప్పగా ఉండేదని.. ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్ లాంటి నేతలు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









