సరికొత్త ప్రేమకథకు శ్రీకారం చుట్టనున్న ఇంద్రగంటి

- August 06, 2017 , by Maagulf
సరికొత్త ప్రేమకథకు శ్రీకారం చుట్టనున్న ఇంద్రగంటి

'జెంటిల్‌మన్‌', 'అమీ తుమీ' హిట్‌ల తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన తర్వాత చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈసారి స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంద్రగంటి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.
'ప్రేమకథ తెరకెక్కించాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. కానీ కుదరలేదు. ఈసారి నా తర్వాత సినిమాతో అది జరిగేలా ఉంది. స్వచ్ఛమైన ప్రేమకథగా ఆ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన కథ దాదాపు సిద్ధం చేశా, నటీనటులను ఎంపిక చేయాలి' అని ఇంద్రగంటి అన్నారు. అనంతరం నటీనటులుగా ఎవరిని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 'ఇంకా ఏదీ నిర్ధారణ కాలేదు. అప్పుడే నటీనటుల గురించి మాట్లాడటం సరికాదు' అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com