పాకిస్తాన్ లాహోర్‌లో మళ్లీ పేలుడు
- August 08, 2017
పాకిస్తాన్ రెండో ఆర్థిక రాజధాని లాహోర్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. పండ్లతో నిండిన ట్రక్కులో అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 34 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పండ్ల మార్కెట్ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవంతులు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని లాహోర్ ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్ ఖాన్ సుంబాల్ మీడియాకు తెలిపారు. బాంబు అమర్చిన వాహనం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కొద్ది రోజుల కిందటే లాహోర్‌లోని ప్రఖ్యాత కూరగాయల మార్కెట్‌లో పాక్‌తాలిబన్లు జరిపిన పేలుళ్లలో 26 మంది చనిపోగా, పదుల మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనకు బాధ్యులు ఎవరనేది తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







