సాయిధరమ్ తేజ కొత్త సినిమా వినాయక్ డైరెక్షన్‌లో

- August 09, 2017 , by Maagulf
సాయిధరమ్ తేజ కొత్త సినిమా వినాయక్ డైరెక్షన్‌లో

దాదాపు ఎనిమిది నెలల తర్వాత డైరెక్టర్ వీవీ వినాయక్ లైమ్ లైట్‌లోకి వచ్చేశాడు. సాయిధరమ్ తేజతో కొత్త ప్రాజెక్ట్‌కి ప్లాన్ చేశాడు ఆయన. అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి.
ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన వినాయక్, ధరమ్ తేజలు మెగాస్టార్ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆకుల శివ దీనికి స్టోరీ రెడీ చేయగా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లు స్క్రీన్ ప్లే అందించనున్నారు.
ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రానికి 'ఇంటలిజెంట్' అనే టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. వరస ప్లాప్‌లను ఎదుర్కొన్న సాయికి, వీవీ వినాయక్‌ ప్రాజెక్ట్‌తోనైనా గట్టెక్కుతాడేమో చూడాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com