వేర్వేరు సంఘటనలలో ముగ్గురు ప్రవాసీయుల మృతి
- August 09, 2017
మనామ: వేర్వేరు సంఘటనలలో ముగ్గురు ప్రవాసీయుల మృతి చెందడంతో గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులు కార్మికులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బహ్రెయిన్ బే స్ట్రీట్లో ఆసియా దేశానికి చెందిన బాబు మార్కంటి ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో తన నిండు జీవితాన్ని కోల్పోయాడు.మరణించిన వ్యక్తి శుభ్రపరిచే సంస్థలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరో ఘటనలో ఆగస్టు 7 వ తేదీన ఉదయం10 గంటల సమయంలో తూర్పు రిఫాలో తన కారులో ఆసియా దేశానికి చెందిన మరొక ప్రవాసీయుడు చనిపోయి ఉన్నట్లు కనుగొన్నారు. కాగా, మరణించిన వ్యక్తిని బాల్కర్ సింగ్ గా గుర్తించారు. అయన గ్లోబల్ కో డబ్ల్యూ .ఎల్. ఎల్. కంపెనీ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడవ సంఘటనలో,వ్యక్తి మంగళవారం ఉదయం అల్ జజీర్ బీచ్ వద్ద సముద్రంలో మునిగి చనిపోయాడు. ఈ మూడు సంఘటనలు నిర్ధారిస్తూ అంతర్గత మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మరణించినవారి గురించిఏ ఇతర వివరాలను వెల్లడించలేదు. వారి భౌతికకాయాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకొంటున్నట్లు ట్వీట్ లో తెలిపింది. బాల్కర్ సింగ్ అనే డ్రైవర్ మరణం గూర్చి మరియు అల్ జజీర్ బీచ్ లో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









