షారుక్‌ సినిమాలో ముగ్గురు సూపర్ స్టార్ లు

- August 10, 2017 , by Maagulf
షారుక్‌ సినిమాలో ముగ్గురు సూపర్ స్టార్ లు

షారుక్‌ ఖాన్‌కి తలైవా రజనీకాంత్‌ అంటే ఎంతో అభిమానం. అందుకే తాను నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో 'లుంగి డ్యాన్స్‌'తో తలైవా కోసం ప్రత్యేక పాటను రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు షారుక్‌ నటించనున్న ఓ చిత్రంలో ఏకంగా రజనీకాంతే అతిథి పాత్రలో మెరవనున్నారట.
షారుక్‌ ఖాన్‌, కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో రానున్న కొత్త ప్రాజెక్ట్‌ 'శిద్యాత్‌'. ఇందులో షారుక్‌కి జోడీగా దీపిక పదుకొణెని ఎంపికచేసుకున్నారట. మరో విషయమేంటంటే.. ఈ చిత్రంలో తలైవాతో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా అతిథి పాత్రలో కనువిందు చేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఇందులో మన 'బాహుబలి' ప్రభాస్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నారట. అయితే అతిథి పాత్రల గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుందట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే నలుగురు సూపర్‌స్టార్లను ఒకే తెరపై చూడచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com