గువామ్‌పై ఆ క్షిపణి 14 నిమిషాల్లో చేరుకుంటుందట
- August 11, 2017
క్షిపణి ప్రయోగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉత్తరకొరియా.. అమెరికాపై కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ద్వీప ప్రాంతమైన గువామ్‌పై ఉత్తర కొరియా ఒకవేళ క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని నిర్దేశిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తాయని ఆ ప్రాంత హోమ్‌లాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా తెలిపారు.
గురువారం మీడియాతో మాట్లాడిన జెన్నా.. ఉత్తరకొరియా చర్యలపై గువామ్ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిపడితే వెంటనే స్థానికులను 15 హెచ్చరిక వ్యవస్థల ద్వారా అప్రమత్తం చేస్తామని చెప్పారు. గువామ్‌లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు.
గువామ్ సమీపంలో క్షిపణి దాడులకు విస్తృత ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా గురువారం ప్రకటించిన నేపథ్యంలో జెన్నా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గువామ్‌లో దాదాపు 7 వేల మంది అమెరికా భ్రదతాసిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







