ఖతార్ వీసా వైవర్: పెదవి విరుపులే
- August 11, 2017దుబాయ్: 80 దేశాలకు చెందిన పౌరులు ఖతార్‌ని సందర్శించేందుకోసం వీసా వెయివర్ అవకాశాన్ని ఆ దేశం ప్రకటించినా, ఆ ప్రకటనకు ఆశించిన స్పందన రావడంలేదు. ఖతార్ పేర్కొన్న 80 దేశాల్లో 47 దేశాలకు చెందినవారికి 30 రోజులపాటు వీసా వైవర్ ఉంటుంది. మిగతా దేశాలకు 90 రోజులపాటు వీసా వైవర్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఖతార్ అధికారులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే వివిధ దేశాలకు చెందిన ప్రజలు మాత్రం ఖతార్ నిర్ణయం పట్ల పెదవి విరుస్తున్నారు. ఖతార్ భద్రత కోసం పాకిస్తాన్ అవసరమయ్యిందిగానీ, పాకిస్తాన్‌కి వీసా వైవర్ సౌకర్యం కల్పించరా? అంటూ ఓ పాకిస్తానీ ప్రశ్నించారు. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి, తమ దేశం పేరు ఆ లిస్ట్ లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అరబ& దేశాల్లో ఒకే ఒక్క దేశానికి అవకాశం కల్పించడం దురదృష్టకరమని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఖతార్‌తో జూన్ 5న బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ తదితర దేశాలు సంబంధాలు తెంచుకున్న దరిమిలా, ఆ దేశం తమ ఉనికిని కాపాడుకునేందుకు అవకాశమున్న మేర ప్రయత్నిస్తూనే ఉన్నా, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







