ఇద్దరు ఫిలిప్పినాస్‌, ఓ బారతీయ యువతికి ఊరట

- August 11, 2017 , by Maagulf
ఇద్దరు ఫిలిప్పినాస్‌, ఓ బారతీయ యువతికి ఊరట

అబుదాబీ: క్యాపిటల్‌లో నిర్బంధించబడిన ఇద్దరు ఫిలిప్పినాస్‌తోపాటుగా ఓ భారతీయ మహిళను లోకల్‌ అథారిటీస్‌ రక్షించాయి. ఫిలిప్పీన్‌ ఎంబసీ ఈ వివరాల్ని వెల్లడించింది. టూరిస్ట్‌ వీసాపై మెయిడ్స్‌గా పనిచేసేందుకు వారు వచ్చినట్లు ఎంబసీ వైస్‌ కాన్సుల్‌, సెక్రెటరీ అన్నె గువెరా చెప్పారు. అక్రమ నిర్బంధానికి సంబంధించి సోషల్‌ మీడియా ద్వారా ఎంబసీకి కొందరు ఇచ్చిన సమాచారంతో లోకల్‌ అథారిటీస్‌ని ఎంబసీ అప్రమత్తం చేసింది. ఈ విషయమై తక్షణం స్పందించినందుకుగాను క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులకు గువేరా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా బాధితులు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ముందు ప్రవేశపెట్టబడ్డారు. బాధితుల స్టేట్‌మెంట్స్‌ని రికార్డ్‌ చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com