ఖతార్‌ వీసా వైవర్‌: పెదవి విరుపులే

- August 11, 2017 , by Maagulf
ఖతార్‌ వీసా వైవర్‌: పెదవి విరుపులే

దుబాయ్‌: 80 దేశాలకు చెందిన పౌరులు ఖతార్‌ని సందర్శించేందుకోసం వీసా వెయివర్‌ అవకాశాన్ని ఆ దేశం ప్రకటించినా, ఆ ప్రకటనకు ఆశించిన స్పందన రావడంలేదు. ఖతార్‌ పేర్కొన్న 80 దేశాల్లో 47 దేశాలకు చెందినవారికి 30 రోజులపాటు వీసా వైవర్‌ ఉంటుంది. మిగతా దేశాలకు 90 రోజులపాటు వీసా వైవర్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఖతార్‌ అధికారులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే వివిధ దేశాలకు చెందిన ప్రజలు మాత్రం ఖతార్‌ నిర్ణయం పట్ల పెదవి విరుస్తున్నారు. ఖతార్‌ భద్రత కోసం పాకిస్తాన్‌ అవసరమయ్యిందిగానీ, పాకిస్తాన్‌కి వీసా వైవర్‌ సౌకర్యం కల్పించరా? అంటూ ఓ పాకిస్తానీ ప్రశ్నించారు. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి, తమ దేశం పేరు ఆ లిస్ట్‌ లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అరబ& దేశాల్లో ఒకే ఒక్క దేశానికి అవకాశం కల్పించడం దురదృష్టకరమని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఖతార్‌తో జూన్‌ 5న బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌, యూఏఈ తదితర దేశాలు సంబంధాలు తెంచుకున్న దరిమిలా, ఆ దేశం తమ ఉనికిని కాపాడుకునేందుకు అవకాశమున్న మేర ప్రయత్నిస్తూనే ఉన్నా, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com