ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం, 37 మంది మృతి, 137 మందికి గాయాలు

- August 11, 2017 , by Maagulf
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం, 37 మంది మృతి, 137 మందికి గాయాలు

ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో 37 మంది మరణించారు. మరో 137మందికిపైగా గాయపడ్డారు.
ఈజిప్టు ఉత్తర తీరంలోని అలెగ్జాండ్రియాలో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకొందని అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసన వెంటనే అధికారులు సహయకచర్యలను చేపట్టారు.
రెండు రైళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొందని అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్లే రాజధాని కైరో నుండి వస్తున్న రైలు ఆగి ఉంటే, మరో రైలు వచ్చి ఢీకొట్టిందని అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సంఘలన స్థలం భయానక వాతావరణం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఎదురెదురుగా వచ్చిన రెండు లోకల్ రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే సాంకేతిక కారణాల వల్ల రాజధాని కైరో నుంచి వస్తున్న రైలు ఆగి ఉండగా మరో రైలు వచ్చి ఢీకొట్టిందని రవాణాశాఖ పేర్కొంది. విచారణకు ఆదేశించినట్లు ఆశాఖ మంత్రి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగనుందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com