ఇరాన్ పై గూఢచర్యం కేసులో 12మంది అరెస్టు
- August 12, 2017
ఇరాన్ గూఢచర్యం కేసులో 12మందిని వివిధ ప్రాంతాల్లో కువైట్ అధికారులు అరెస్టు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 2015లో అబ్దాలీ సెల్‌పై జరిపిన దాడిలో తుపాకులు, పేలుడు పదార్థాలు కనుగొన్న తర్వాత 25మంది కువైట్ జాతీయులపై, ఒక ఇరాన్ జాతీయుడిపై కువైట్ ప్రభుత్వం అభియోగాలు మోపింది. వీరందరూ కూడా షియాలే. కువైట్‌కు వ్యతిరేకంగా ఘర్షణలు, గొడవలు సృష్టించేందుకు వీరు కుట్ర పన్నారని కువైట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జైలుశిక్షలు విధించారు. గత జూన్‌లో కువైట్ అత్యున్నత కోర్టు ఈ మరణశిక్షను రద్దు చేసింది. వారిలో కొందరికి శిక్ష పెంచగా, మరికొందరికి తగ్గించింది. ఇరాన్ జాతీయుడితో సహా 14మందికి వారి పరోక్షంలో శిక్షలు ఖరారయ్యాయి. కాగా ఈ కేసులో తమ ప్రమేయం లేదని ఇరాన్ తిరస్కరించింది. ఇదే కేసులో దోషులైన మరో ఇద్దరి కోసం అధికారులు ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







