నేపాల్‌లో భారీ వరదలు, 36 మంది దుర్మరణం

- August 12, 2017 , by Maagulf
నేపాల్‌లో భారీ వరదలు, 36 మంది దుర్మరణం

నేపాల్‌లో భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు 36 మంది దుర్మరణం చెందగా, 12 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వరదలకు వందలాది ఇళ్లు నీట మునగగా..వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆ దేశ హోంశాఖ పేర్కొంది.

మరోవైపు ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన కేబినెట్‌ సహాయక చర్యల్ని మరింత ఉధృతం చేయాలని స్థానిక, జిల్లా అధికారులను ఆదేశించింది.  ఝపా, మోరంగ్, సున్సారీ, సప్టారీ, సిరాహా, సర్లాహీ, రౌతహట్, బంకే, బర్దియా, దంగ్‌ జిల్లాలు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నట్లు హోంమంత్రి శర్మ వెల్లడించారు. వరద నీరు చొచ్చుకురావడంతో బిరత్‌నగర్‌ విమానాశ్రయాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com