భారత ప్రయాణీకులతో అమర్యాదగా వ్యవహరించిన చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది

- August 13, 2017 , by Maagulf
భారత ప్రయాణీకులతో అమర్యాదగా వ్యవహరించిన చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది

భారత ప్రయాణీకులతో షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన సత్నమ్‌సింగ్ అనే ప్రయాణీకుడు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చాడు.
ఈ నెల 6వ, తేదిన చైనీస్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో శాన్‌ప్రాన్సిస్కోకు ప్రయాణీస్తున్న సమయంలో పలువురు భారత ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్ సిబ్బంది అవమానించారని ఆయన సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయమై ఎయిర్‌పోర్ట్ అధికారుల దృష్టికి కూడ దీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. అయితే అక్కడి అధికారులు కూడ తనపైనే ఆగ్రహన్ని ప్రదర్శించారని ఆయన చెప్పారు.
భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆ అధికారులు ఈ రకంగా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలను చైనీస్ ఎయిర్‌లైన్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com