బ్యాన్డ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్‌

- August 14, 2017 , by Maagulf
బ్యాన్డ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: 24 మంది స్మగ్లర్ల అరెస్ట్‌

రియాద్‌: అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివిధ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 మిలియన్‌ యాంఫిటమైన్‌ (కాప్టగాన్‌) పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు ఇంటీరియర్‌ మినిస్ట్రీ వెల్లడించింది. ఓ కేసులో యూఏఈ అథారిటీస్‌ 6 మిలియన్‌ యాంఫిటమైన్‌ ట్యాబ్లెట్స్‌ని స్వాధీనం చేసుకోగా, ఇద్దరు సిరియన్లను ఈ కేసులో అరెస్ట్‌ చేయడం రిగింది. మరో కేసులో సౌదీ అలాగే యూఏఈ అథారిటీస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌ 3 మిలియన్‌ యాంఫిటమైన్‌ని వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో 11 మంది అరెస్ట్‌ అయ్యారు. వీరిలో 10 మంది సిరియన్లు, సౌదీకి చెందిన ఓ వ్యక్తి ఉన్నారు. ఇదిలా ఉండగా సౌదీ బోర్డర్‌ గార్డ్స్‌ 335 కిలోల నార్కోటిక్‌ సబ్‌స్టాన్సెస్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 11 మంది స్మగ్లర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com