తీవ్రవాదుల ఏరివేత: ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు

- August 14, 2017 , by Maagulf
తీవ్రవాదుల ఏరివేత: ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు

అల్‌ అవామియా: కాతిఫ్‌లోని అల్‌ అవామియాలోగల అల్‌ ముసావారాలో భద్రతాదళాలు తీవ్రవాదుల్ని పూర్తిగా ఏరివేయడంతో మూడు నెలల తర్వాత ప్రజలు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతోంది. సౌదీ స్పెషల్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ పూర్తిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కొన్నాళ్ళుగా ఇక్కడ తిష్టవేసిన తీవ్రవాదులు, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంఓతపాటుగా ఇక్కడినుంచే దేశంపై దండెత్తే కార్యక్రమాలు చేపట్టారు. వారిని పూర్తిగా భద్రతాదళాలు నిర్వీర్యం చేయగలిగాయి. సుమారుగా 428 కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి తీవ్రవాదుల కారణంగా వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళాయి. వారందరికీ ప్రభుత్వం తిరిగి అల్‌ ముసావారా విలేజ్‌లో పునరావాసం కల్పిస్తోంది. కొన్ని వారాల్లోనే పూర్తిగా ఇక్కడి భవనాల్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలావరకు కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిల్లో కొన్ని పూర్తయి, పునరావాసానికి అందుబాటులో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com