నాగచైతన్య నటించిన ' యుద్ధ శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్
- August 17, 2017
వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న అక్కినేని నాగ చైతన్య నటించిన తాజాగా చిత్రం 'యుద్ధం శరణం'. చైతు , లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ మూవీ లో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ లో నటించడం విశేషం. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ మూవీ సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
తమిళ డైరెక్టర్ కృష్ణ ఆర్వి మరిముత్తు దర్శకత్వం వహిస్తుండగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ మూవీ ని నిర్మించడం జరిగింది. 'పెళ్లి చూపులు' ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉండగానే నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే చిత్రాన్ని ఫిక్స్ చేసాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







