కేరళలో మాజీ మహిళా బి జె పి కౌన్సిలర్ యూఏఈ కారు ప్రమాదంలో మృతి
- August 17, 2017
షార్జా: కారు డోర్ సరిగ్గా మూయకపోవడంతో మలుపులో అది అకస్మాత్తుగా తెరుచుకోవడంతో కేరళలో మాజీ మహిళా బి జె పి కౌన్సిలర్ యూఏఈ లో ప్రస్తుత బ్యూటీషియన్ ఒక విద్యుత్ స్థంబానికి తల ఢీ కొనడంతో ఆమె దుర్మరణం పాలయ్యాయంది. ఈ విషాదకార ఘటన స్థానికంగా ఉన్న పలువురు ప్రవాస భారతీయుల హృదయాలను కలచివేసింది. " మా గల్ఫ్ డాట్ కామ్ " సేకరించిన వివరాల ప్రకారం మంగళవారం 40 ఏళ్ల సునీతా ప్రశాంత్ కారు వెనుక సీటులో కూర్చొని సీటు బెల్టును ధరించడంలో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. షార్జాలోని దైద రోడ్డుపై కదిలే కారు నుండి ఆమె ఒక్కసారిగా జారిపోయి ఓ విద్యుత్ స్థంబానికి తల బలంగా ఢీ కొనడంతో అక్కడిక్కడే సునీతా ప్రశాంత్ ప్రాణాలు విడిచారు. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన కాసరాగూడా జిల్లాలోని అడుక్కత్ వాయల్ బీచ్ ప్రాంతం నుండి వచ్చిన సునీతా ప్రశాంత్ గత ఐదు సంవత్సరాలుగా షార్జాలోని ఒక బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్ గా పని చేస్తున్నాడు. ఆమె 2011 లో కేరళ రాష్ట్ర పురపాలక ఎన్నికలలో ఉడుమా నియోజకవర్గం లో కాసరాగూడా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కౌన్సిలర్ గా ఎన్నికలలో గెలుపొందారని షార్జాలోని ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ అధ్యక్షుడు గణేష్ అరమంగానం పేర్కొన్నారు. సునీత బ్యూటీపార్లర్ ఉన్న అదే అపార్ట్మెంట్లో ఇతర సహోద్యోగులతో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లో కీటకాల నియంత్రణకు పురుగుమందులను వారి ఫ్లాట్లో వెదజల్లబడినందున మూడు గంటలపాటు ఫ్లాట్ నుంచి దూరంగా ఉండాలని ఫ్లాట్ యజమాని సలహా ఇచ్చారు. ఈ పరిస్థితులలో వారు కారు తీసుకొని ఒక షికారుకు వెళ్లారు. అదే సమయంలో పైన పేర్కొన్న ప్రమాదం జరిగింది ఆ వాహనం రహదారిపై పడి జారుకొంటూ వెళ్లి డివైడర్ ని గుద్దుకొంది. ఈ ఘటనలో ఇతరులు గాయపడ్డారు ఈ కారు యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు సంవత్సరాల క్రితం యుఎఇకి వచ్చిన ఆమె తన కుటుంబ ఆర్థిక వ్యవహారాల కారణంగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన సునీతకు భర్త ప్రశాంత్ ఇద్దరు పిల్లలు ఉన్నారు."ఆమె భర్త ప్రశాంత్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. గత నెలలో ఆయన యూఏఈ పర్యటనకు వచ్చి మూడు నెలల పాటు వారు బుర్ దుబారులో ఒక గదిలోసంతోషంగా గడిపేరని షార్జాలోని ఇండియన్ పీపుల్స్ ఫోరమ్ అధ్యక్షుడు గణేష్ అరమంగానం తెలిపారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తిచేసిన తర్వాత ఆమె పార్ధీవ శరీరం తన స్వస్థలం కేరళ కు పంపనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







